తెలుగు దర్శకులు సూర్యని పట్టించుకోవడం లేదా..?
on Feb 15, 2017

సూర్య..పక్కా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు ప్రయోగాత్మక చిత్రాలకు సై అంటూ తెలుగు, తమిళ భాషల్లో మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో. బేసిగ్గా సూర్య తమిళ హీరో..ఆ రాష్ట్రంలో అక్కడ ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..అయితే తన యాక్టింగ్‌తో తమిళనాడు కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను..మార్కెట్‌ను సంపాదించుకున్నాడు...ఇదివరకటిలా హీరోలు తమ సొంత ప్రాంతానికే పరిమితం కావడం లేదు..అవకాశం ఉంటే ఇతర భాషల్లో సైతం నటిస్తున్నారు. డబ్బింగ్ చిత్రాలతో మనల్ని పలకరిస్తున్న సూర్యతో స్ట్రయిట్ తెలుగు మూవీ చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆయనతో సినిమా తీయడానికి మేం ఎప్పుడూ రెడీనే కానీ సూర్యకే కాల్షీట్లు ఖాళీగా లేవు అంటూ కొందరు దర్శకులు చెబుతున్నమాట..కానీ ఈ మాట నిజం కాదట..సింగం-3 ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సూర్యని ఇదే విషయంపై అడగ్గా..ఆ విషయం నన్ను అడగటం కంటే తెలుగు దర్శకులను అడిగితే బాగుంటుంది..స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించాలని నేను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను కానీ..ఇక్కడి దర్శకుల నుంచి ఎలాంటి పిలుపు రావడం లేదు అని తన మనసులోని మాటను బయటపెట్టారు సూర్య.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



