అమ్మాయితో ఆర్జీవీ డాన్స్
on Dec 24, 2019
'ఓడలు బళ్ళు అవుతాయి. బళ్ళు ఓడలు అవుతాయి' సామెతకు చక్కటి ఉదాహరణగా రామ్‌గోపాల్ వర్మను చూపించవచ్చు. ఒకప్పుడు 'శివ', 'సత్య', 'రంగీలా', 'సర్కార్' వంటి తీసిన వర్మ, ఇప్పుడు థియేటర్లలో కాకుండా కేవలం వార్తల్లో నిలిచే సినిమాలు మాత్రమే తీస్తున్నాడు. ప్రతి సినిమాకు కొత్త పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నాడు. ఈసారి ఆ పబ్లిసిటీ పీక్స్ కి వెళ్ళింది. స్టేజి మీద స్వయంగా రామ్ గోపాల్ వర్మ స్టెప్పులు వేసే వరకు వెళ్ళింది.
అగస్త్య మంజు దర్శకత్వంలో రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా 'బ్యూటిఫుల్'. 'ట్రిబ్యూట్ టు రంగీలా' అనేది సినిమా కాప్షన్. ఇందులో నైనా గంగూలీ హీరోయిన్. టైటిల్ కి న్యాయం చేసేలా నైనా గంగూలీ అందాలను ఎన్ని యాంగిల్స్ లో చూపించాలో... వర్మ అండ్ కో కలిసి అన్ని యాంగిల్స్ లో చూపించింది. బీచ్ సాంగ్ లో నైనా అందాలు ఆరబోసింది. రంగీలా ట్రిబ్యూట్ మాట ఏమో గానీ... వర్మ పర్వర్షన్ ఎలా ఉంటుందో ఈ సినిమా మరోసారి చెప్పేలా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నైనా గంగూలీ స్టేజి మీద పెర్ఫార్మన్స్ ఇచ్చింది. మధ్యలో స్టేజి దిగి వర్మను కూడా తనతో డాన్స్ చేయమని కోరింది. దాంతో ఆయన కూడా నైనా గంగూలీతో కలిసి స్టెప్పులు వేశాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
