సహనటిపై అత్యాచార ఆరోపణలతో అరెస్టయిన నటుడు-నిర్మాత
on Jan 29, 2022

సహనటిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అత్యాచారం చేశాడనే అభియోగంతో ఒక కన్నడ నటుడు, నిర్మాతను శనివారం కర్నాటక పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని పేరు హర్షవర్ధన్ అలియాస్ విజయ్ భార్గవ్ అని తెలిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అతను 'విజన్ 2023' అనే కన్నడ మూవీలో నటించి, ఆ మూవీని నిర్మించాడు. అతనితో తను రెండేళ్లపాటు స్నేహం చేసినట్లు ఫిర్యాదుదారైన నటి తెలిపింది. పెళ్లి చేసుకుంటానని వంచించి, రెండేళ్లుగా తనను నిందితుడు లైంగికంగా వాడుకున్నాడని ఆమె ఆరోపించింది.
Also read: సినిమా వివాదం.. గౌడ్ కమ్యూనిటీకి క్షమాపణలు!
పెళ్లి గురించి అడిగిప్పుడల్లా ఆ నటుడు-నిర్మాత తనపై బెదిరింపులకు పాల్పడుతూ వస్తున్నాడనీ, తనెందుకు ఆమెను పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నాడనీ బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది.
Also read: 'విరాట పర్వం' కథ విని క్షణాల్లో 10 లక్షల చెక్ ఇచ్చారు
ఐపీసీ సెక్షన్లు 417 (చీటింగ్), 376 (అత్యాచారం), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద పోలీసులు ఫిర్యాదును నమోదు చేసుకున్నారు. ఇప్పటికే వారు ఆ కేసుకు సంబంధించి కొన్ని సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపారు. నిందితుడిని జుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



