సమంత నాగ చైతన్య ల బామ్మ మృతి
on Dec 1, 2023
సమంత,నాగ చైతన్యలు కలిసి మొదటి సారిగా స్క్రీన్ షేర్ చేసుకున్నమూవీ ఏ మాయ చేసావే. ఈ మూవీలో సమంత బామ్మగా నటించిన నటిమణి పేరు సుబ్బలక్ష్మి. తెలుగు, తమిళ ,మలయాళ చిత్రాల్లో బామ్మ గా నటించి ఎంతో మందిని తన నటనతో ఆకట్టుకుంది. తాజాగా ఆమె కి సంబంచిన ఒక వార్త దక్షిణ భారతీయ చిత్ర సీమని విషాదంలో ముంచెత్తుతుంది.
సుబ్బలక్ష్మి గారు నిన్న కొచ్చి లో పరమపదించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటు తుదిశ్వాస విడిచారు. ఆమె మరణించిన విషయాన్ని సుబ్బలక్ష్మి గారి మనవరాలు సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. దీంతో పలు భాషలకి చెందిన చిత్ర ప్రముఖులతో పాటు ఆమె అభిమానులు సుబ్బలక్ష్మి గారి భౌతికదేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.
తన సినీ కెరీర్లో సుమారు 70 చిత్రాల వరకు నటించిన సుబ్బలక్ష్మి గారు సినీ పరిశ్రమలోకి రాక ముందు జవహర్ బాలభవన్ లో ఎంతో మందికి సంగీతం నాట్య రంగాల్లో శిక్షణ ని ఇచ్చారు. అలాగే దక్షిణ భారతదేశం మొత్తంలోనే ఆల్ ఇండియా రేడియోలో పని చేసిన మొదటి లేడీ కంపోజర్ గా ఆమె కీర్తిని గడించారు. అలాగే ఎన్నో చిత్రాల్లోని పాత్రలకి తన గళాన్ని అందించారు. ఆమె వయసు ప్రస్తుతం 87 సంవత్సరాలు. మళయాళంలో మమ్ముట్టి ,మోహన్ లాల్ తో కలిసి చాలా సినిమాల్లో నటించిన సుబ్బలక్ష్మి గారి చివరి మూవీ దళపతి విజయ్ హీరోగా వచ్చిన బీస్ట్
Also Read