2021 జ్ఞాపకాలుః సక్సెస్ కొనసాగించిన కెప్టెన్స్!
on Dec 28, 2021
.webp)
ప్రీవియస్ మూవీస్ తో సక్సెస్ చూసిన కొంతమంది దర్శకులు.. ఈ ఏడాది కూడా తమ కొత్త చిత్రాలతో విజయాలు అందుకుని ఆ పరంపరని కొనసాగించారు. ఆ దర్శకుల వివరాల్లోకి వెళితే..
శేఖర్ కమ్ములః- 2017లో `ఫిదా`తో బ్లాక్ బస్టర్ కొట్టిన సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. నాలుగేళ్ళ గ్యాప్ తరువాత ఈ ఏడాది `లవ్ స్టోరి`తో పలకరించారు. యువ సామ్రాట్ నాగచైతన్య, డాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ ముంగిట మంచి విజయం సాధించింది.
వేణు శ్రీరామ్ః- 2017లో `ఎంసీఏ`తో ఘనవిజయం అందుకున్న వేణు శ్రీరామ్.. నాలుగేళ్ళ విరామం అనంతరం ఈ సంవత్సరం `వకీల్ సాబ్`తో ఎంటర్టైన్ చేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమా టికెట్ విండోస్ ముంగిట కాసుల సందడి చేసింది.
సుకుమార్ః- 2018లో `రంగస్థలం`తో సంచలనం సృష్టించిన బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్.. ఈ క్యాలెండర్ ఇయర్ లో `పుష్ప - ద రైజ్`తో ముందుకొచ్చాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజై వసూళ్ళ వర్షం కురిపిస్తోంది.
రాహుల్ సాంకృత్యన్ః
2018లో `టాక్సీవాలా`తో ఫస్ట్ సక్సెస్ చూసిన యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్.. మూడేళ్ళ తరువాత `శ్యామ్ సింగ రాయ్`తో ఎంటర్టైన్ చేశాడు. నేచురల్ స్టార్ నాని టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమా.. క్రిస్మస్ కానుకగా రిలీజై విజయపథంలో పయనిస్తోంది.
కిశోర్ తిరుమలః- ప్రీవియస్ మూవీ `చిత్రలహరి` (2019)తో మంచి విజయం చూసిన కిశోర్ తిరుమల.. ఈ ఏడాది సంక్రాంతికి `రెడ్` రూపంలో చెప్పుకోదగ్గ సక్సెస్ అందుకున్నాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇందులో హీరోగా నటించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



