ఇకపై అలాంటి పాత్రలు చేయను!
on Dec 31, 2021

గ్లామర్ రోల్స్ తో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత గత కొంతకాలంగా నటనా ప్రాధాన్యమున్న పాత్రలలో నటిస్తోంది. ఇక 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ తర్వాత ఆమె ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. ఇకపై తాను ఛాలెంజింగ్ రోల్స్ లోనే నటిస్తానని, ఏ సినిమాలోనూ క్యూట్ గర్ల్ గా నటించనని తేల్చి చెప్పింది.
'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ లో సమంత పోషించిన రాజీ పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజీగా సమంత ఒదిగిపోయిన తీరుకి ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఈ సిరీస్ సమంతకు ఉత్తమ నటిగా ఓటీటీ ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు, మోస్ట్ పాపులర్ ఓటీటీ యాక్టర్స్ లిస్ట్ లో నాలుగో స్థానం వచ్చేలా చేసింది. బాలీవుడ్ నుండి సమంతకి పలు ఆఫర్స్ సైతం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నేషనల్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఫ్యామిలీ మ్యాన్ 2 లోని రాజీ పాత్రకు తాను ఊహించినదానికంటే ఎక్కువే అబినందనలు దక్కాయని, ఈ సిరీస్ తో కొత్త సవాళ్లను స్వీకరించగలననే నమ్మకం ఏర్పడిందని సమంత చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు అందానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి అలసిపోయానని, ఇకపై అలాంటి రోల్స్ చేయకూడదు అనుకుంటున్నానని తెలిపింది. నటిగా ఛాలెంజింగ్ పాత్రలు చేయాలనుకుంటున్నాను అని సమంత పేర్కొంది.
సమంత ఇప్పటికే 'శాకుంతలం' షూటింగ్ పూర్తి చేసింది. ప్రస్తుతం 'యశోద' మూవీ చేస్తోంది. అలాగే 'ఎరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' అనే ఇంటర్నేషనల్ ఫిల్మ్ లోనూ సమంత నటిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



