గోవాలో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోబోతున్న విజయ్-రష్మిక!
on Dec 31, 2021

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మికా మందన్న ప్రస్తుతం పని నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నారు. గోవాలో హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తున్న వారు, అక్కడే నూతన సంవత్సరాంరభ క్షణాలను సెలబ్రేట్ చేసుకోనున్నారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో జంటగా నటించిన ఆ ఇద్దరు సంచలన తారలు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారంలో ఉండగా, తామిద్దరం కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమేనని వారు చెబుతూ వస్తున్నారు.
Also read: 'లైగర్' గ్లింప్స్.. 'అర్జున్ రెడ్డి'కి మించి!
ఇటీవల ఆ జోడీ ముంబైలో ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేసి, ఒకే కారులో వెళ్తూ కెమెరా కంటికి చిక్కారు. తరచూ ముంబైలో కలుసుకుంటూ వస్తున్న వాళ్లు హైదరాబాద్‌లో ఒకే జిమ్‌కు వెళ్తున్నారు. ఇలా తరచూ కలిసి కనిపిస్తుండటంతో వారి అనుబంధంపై వదంతులకు ఆస్కారమిస్తోంది. విజయ్ 'లైగర్' సినిమా కోసం తాను ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నానని ఇటీవల వెల్లడించింది రష్మిక.
Also read: 'అర్జున ఫల్గుణ' మూవీ రివ్యూ
"మేం గుడ్ ఫ్రెండ్స్‌మి. ఆఫ్-స్క్రీన్‌లో లిటరల్‌గా నా బెస్ట్ ఫ్రెండ్. మా ఇద్దరి ఎనర్జీలు మ్యాచ్ అవుతాయి, బ్లెండ్ అవుతాయి. మా మధ్య కెమిస్ట్రీ కోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. విజయ్, నేను జస్ట్.. తెరపై వర్క్ చేస్తాం. మేం కలిసి పనిచేసే మూడో సినిమా గురించి అతన్నే మీరడగాలి. అతను 'లైగర్' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా కోసం నేను ఎదురుచూస్తున్నాను. ఆ తర్వాత ఏం జరుగుతుందోననే కుతూహలంతో ఉన్నాను. మా ఇద్దరి టైమ్‌లైన్స్ మ్యాచ్ అయితే కలిసి ఓ సినిమా చేస్తాం." అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. రష్మిక.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



