2021 జ్ఞాపకాలుః స్టార్స్ - డైరెక్టర్స్ .. కెరీర్ బెస్ట్ గ్రాసర్స్!
on Dec 31, 2021

2021 క్యాలెండర్ ఇయర్ లో కొంతమంది స్టార్స్, కెప్టెన్స్ కెరీర్ బెస్ట్ గ్రాసర్స్ చూశారు. ఆ వివరాల్లోకి వెళితే..
రవితేజ - గోపీచంద్ మలినేనిః- ఈ ఏడాది సంక్రాంతి సీజన్ లో జనం ముందు నిలచిన చిత్రం `క్రాక్`. విడుదల సమయంలో కొన్ని ఆటంకాలు ఎదురై ఆలస్యంగా షోస్ మొదలైనా.. తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుందీ కాప్ డ్రామా. అంతేకాదు.. ఈ సినిమాతో మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తమ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ చూశారు. ఒకే చిత్రంతో ఇద్దరు కూడా మెమరబుల్ మాస్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, బుచ్చిబాబు సానాః- ఈ ఏడాది ఫిబ్రవరి సంచలనం `ఉప్పెన`తో కథానాయకుడిగా వైష్ణవ్ తేజ్, నాయికగా కృతిశెట్టి, దర్శకుడిగా బుచ్చి బాబు సానా తొలి అడుగేశారు. మొదటి ప్రయత్నంలోనే ఘనవిజయం సొంతం చేసుకున్నారు. ఆపై `కొండ పొలం`తో వైష్ణవ్, `శ్యామ్ సింగ రాయ్`తో కృతి ఆకట్టుకున్నా.. ఇద్దరికీ `ఉప్పెన`నే కెరీర్ బెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అలాగే దర్శకుడు బుచ్చిబాబు సానాకి కూడా.
నవీన్ పోలిశెట్టిః- రెండేళ్ళ క్రితం `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`గా ఆకట్టుకున్న యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి.. ఈ ఏడాది `జాతిరత్నాలు`తో సందడి చేశాడు. అఖండ విజయం సాధించిన ఈ సినిమాతో నవీన్ కెరీర్ బెస్ట్ గ్రాసర్ అందుకున్నాడు. అలాగే, ఆ చిత్ర దర్శకుడు అనుదీప్ కి ఇది రెండో సినిమా కాగా.. తనకి కూడా ఇదే బెస్ట్ గ్రాసర్.
వేణు శ్రీరామ్ః- `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీరామ్.. ఈ ఏడాది `వకీల్ సాబ్`తో పలకరించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాతో కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ అందుకున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్.
అఖిల్ అక్కినేనిః- `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`తో తొలి విజయాన్ని అందుకున్న యువ కథానాయకుడు అఖిల్ అక్కినేనికి.. తన కెరీర్ లో ఇదే హయ్యస్ట్ గ్రాసర్ కావడం విశేషం.
బాలకృష్ణ, బోయపాటిః- ఈ యేటి మేటి విజయాల్లో ఒకటైన `అఖండ`.. ఇటు నటసింహం నందమూరి బాలకృష్ణకి, అటు దర్శకుడు బోయపాటి శ్రీనుకి కెరీర్ బెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అలాగే, కథానాయిక ప్రగ్యా జైశ్వాల్ కి కూడా తన కెరీర్ లో ఇదే హయ్యస్ట్ గ్రాసర్.
అల్లు అర్జున్ - సుకుమార్ః- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్.. ఈ సంవత్సరాంతంలో `పుష్ప - ద రైజ్`తో ఎంటర్టైన్ చేశారు. వసూళ్ళ వర్షం కురిపిస్తున్న ఈ సినిమాతో అటు బన్నీ, ఇటు సుక్కు ఇద్దరు కూడా కెరీర్ బెస్ట్ గ్రాసర్ అందుకునే అవకాశముందని ట్రేడ్ బజ్. అలాగే నాయిక రష్మిక, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కి కూడా ఇదే హయ్యస్ట్ గ్రాసర్ కానుంది.
మొత్తమ్మీద.. 2021 సంవత్సరం పలువురికి బెస్ట్ గ్రాసర్స్ అందించి వారి కెరీర్ లో మెమరబుల్ ఇయర్ గా నిలిచిందనే చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



