యువతకి ఉచిత సలహాలిచ్చి నాలుక్కరుచుకున్న సల్మాన్ ఖాన్
on Jun 7, 2017
గతం మరచిపోయి యువతకి ఉచిత సలహాలిచ్చిన సల్మాన్ ఖాన్ కి సోషల్ మీడియాలో తగిన శాస్తే జరిగింది. తన చారిటీ సంస్థ బీయింగ్ హ్యూమన్ నుండి వచ్చిన ఈ-సైకిల్స్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ, "సైకిల్స్ అంటే ఓకే కానీ, యువతకి మోటార్ సైకిళ్ళు చాలా ప్రమాదకరం. అది వాళ్ళకే కాకుండా పక్క వాళ్ళకి కూడా ప్రాణ సంకటం. మేమంటే ఫిలిం సిటీ లో ప్రమాదం లేని ప్రదేశాల్లో షూటింగుల కోసం వాహనాలు నడుపుతాం. కానీ, కొందరు హైవేల మీద రెక్లెస్ గా రేసులు పెట్టుకోవడం గమనించాను," అని అన్నారు. సల్మాన్ చేసిన ఈ వ్యాఖ్యలకి ట్విట్టర్ లో తీవ్ర విమర్శలు వచ్చాయి.
2002 లో ఒకరు మరణం చెంది, మరో నలుగురు గాయపడ్డ హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ ప్రధాన నిందుతుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే, హై కోర్ట్ సల్మాన్ ఖాన్ ని ఈ కేసులో నిర్దోషిగా నిర్ధారించినప్పటికీ, ట్విట్టర్ లో ఆయనని ఒక ఆట ఆడుకున్నారు. సల్మాన్ ఖాన్ రోడ్ సేఫ్టీ గురించి లెక్చర్ ఇవ్వడమనేది, విజయ్ మాల్యా సమయానికి బకాయిలు ఎలా చెల్లించాలి అని చెప్పినట్టుగా ఉందని ఒక ట్విట్టర్ యూజర్ రిప్లై ఇవ్వగా, సల్మాన్ ఖాన్ సైకిల్ నడుపుతున్న ఫోటో పై కామెంట్ చేస్తూ భాయ్ ఫుట్ పాత్ మీదకి మాత్రం వెళ్లొద్దు అని ఇంకో యూజర్ పోస్ట్ చేసారు. ఇంకొందరయితే, సల్మాన్ ఖాన్ ని ఒక అట బొమ్మలా ఆడుకున్నారు. మరి దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో!
Also Read