కమల్ హాసన్ వ్యాఖ్యలకి స్పందించిన కేటీఆర్
on Jun 7, 2017
ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీ గా ఉండే ఐటీ మినిస్టర్ కేటీఆర్, ఒక్కోసారి తన సొంత కుటుంబంలో జరిగే వేడుకలకి కూడా హాజరవ్వని పరితిత్తుల్లో ఉండే రామ్ చరణ్ ఏంటి కాదలి అనే ఒక చిన్న సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి అతిధులుగా రావడం ఏంటి అని అందరి మదిలో మెలిగిన సందేహం. వారందరికీ కేటీఆర్ తన స్పీచ్ లో వివరణ ఇచ్చారు. కాదలి చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే రాయడంతో పాటు, దర్శక, నిర్మాణ బాధ్యతలు మోసిన పట్టాభి కేటీఆర్ కి చిన్న నాటి మిత్రుడు. పట్టాభి డబ్బే ప్రధానంగా పెట్టుకొని ఉండుంటే ఈ రోజు మిలియన్ డాలర్లు సంపాదించే వాడు. కానీ, తనకి సినిమా అంటే ప్యాషన్ కాబట్టి అన్నీ వదులుకొని తన గోల్ రీచ్ అవ్వడానికి శ్రమ పడ్డాడు. నా మిత్రుడి కోసం నేను పిలవగానే వచ్చిన నా మిత్రుడు రామ్ చరణ్ కి అభినందనలు. ఒక పొలిటిషన్ ఇలాంటి సభలకి వస్తే అంతటి ఆదరణ ఉండదని తెలుసు. అందుకే చరణ్ ని రమ్మని అడగడం జరిగింది. పట్టాభి ని ఎంకరేజ్ చేసిన సురేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను నిజంగా గర్వపడే విషయం ఏంటంటే బాహుబలి 2 అనే ఒక తెలుగు సినిమా ప్రపంచం మొత్తాన్ని షేక్ చేసింది. అమెరికాలోని అమెరికన్లు మన సినిమా గురించి నాతో ప్రత్యేకంగా మాట్లాడడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది అని కేటీఆర్ అన్నారు. జీఎస్టీ గురించి మాట్లాడుతూ, దేశం మొత్తానికి ఒకే టాక్స్ ఉండడం ఒక రకంగా మంచిదే అని. కానీ, చిత్ర పరిశ్రమకి 28 % స్లాబ్ ఉండడం ఇబ్బంది కలిగించే అంశం అని... కమల్ హాసన్ లాంటి వారు సినిమాలు మానేస్తాననడం ఇది ఇండస్ట్రీ కి ఎంత భారమో చెబుతుందని... తమిళ, కన్నడ, మలయాళ మరియు ఇతర ఇండస్ట్రీ వర్గాల్ని కలుపుకుపోయి అరుణ్ జైట్లీ ని కలిసి ఈ విషయం పై చర్చిస్తాం అని కేటీఆర్ హామీ ఇచ్చారు. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం తెలుగు ఇండస్ట్రీ కి ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రామిజ్ చేసారు.