దాసరి వెనకాల పెద్ద తలకాయలు లేవనే కదా ఇలా చేస్తున్నారు
on Jun 7, 2017
ఆ నాలుగు కుటుంబాలని ప్రశ్నించగలిగిన ధైర్యం చేసినవాడు దాసరి నారాయణ రావు ఒక్కరే. చిన్న నిర్మాతలకి ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటూ, ఇండస్ట్రీ లో ఎవరికి అన్యాయం జరిగినా అది తన బాధ్యతగా తీసుకొని వాళ్ళ సమస్యల్ని దూరం చేసేందుకు కృషి చేసిన మహానుభావుడికి తీవ్ర అన్యాయం జరిగింది. అయన మరణం తర్వాత ఇండస్ట్రీ దాదాపు ఆయనని మరచిపోయింది. ఆ నాలుగు కుటుంబాల్లో ఒక పెద్ద కాలం చెల్లిస్తే, భయానికో భక్తికో ఇండస్ట్రీలో చిన్న, పెద్ద అందరు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు అయ్యే వరకు ఉండే వారు. ఎందుకంటే ఆ కుటుంబాల్లో శాసించే వాళ్ళు వేరే ఉన్నారు కాబట్టి. కానీ, దాసరి నారాయణ రావు కుటుంబంలో మళ్ళీ శాసించే నాధుడు లేకపోవడం అందరూ లైట్ తీసుకునేలా చేసింది. పెద్దాయనే పోయారు, ఇంక ఎవరు మనల్ని అడుగుతారు అనుకున్నారో ఏమో కనీసం ఒక సంతాప కార్యక్రమం పెట్టే ఆలోచన కూడా చేయలేదు. ఏదో ఆ రోజు వచ్చి పరామర్శించి వెళ్లిన వారే కానీ, తర్వాత ఆయన గుర్తుగా ఏదైనా చేద్దాం అని ఎవరి మదికి తోచ లేదు.
ఇది పక్కన పెడితే, దాసరి దగ్గర కోట్లలో అప్పు తీసుకున్న వారు అయితే, ఆయన ఇంటి దరిదాపుల్లోకి కూడా వెళ్లడం మానేశారంట. నిజంగా ఆ కుటుంబంలో దాసరి లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్ ఇంకొకరు ఉండుంటే ఇలాగే చేసేవారా? ఒక లెజెండరీ డైరెక్టర్ కి తెలుగు సినీ పరిశ్రమ ఇస్తున్న చివరి నివాళి ఇదేనా? కళామతల్లికి కూడా కంట నీరు తెప్పించే సంఘటన ఇది. పెద్దలారా ఇప్పటికయినా మేల్కోండి, పెద్దాయనకి ఆత్మ శాంతి కలిగేలా తగు కార్యక్రమాలు చేయండి.
Also Read