'కాంతార' హీరోకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు!
on Aug 16, 2024
కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) 'కాంతార' సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2022 డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రంలో రిషబ్ నటనకు అన్ని భాషల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆయన నటన గురించి అందరూ గొప్పగా మాట్లాడుకున్నారు. అంతలా తన నటనతో ఆకట్టుకున్న రిషబ్ కి జాతీయ అవార్డు లభించింది. (70th National Film Awards)
తాజాగా ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి అవార్డు గెలుపొందాడు. 2022 ఏడాదికి గాను ప్రకటించిన అవార్డుల్లో 'కాంతార'లోని అద్భుత నటనకు గాను రిషబ్ పురస్కారం అందుకోనున్నాడు. జాతీయ అవార్డుల్లో సత్తా చాటడంతో.. రిషబ్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
భూతకోల నేపథ్యంలో మైథలాజికల్ టచ్ తో రూపొందిన 'కాంతార' చిత్రానికి రచన, దర్శకత్వం రిషబ్ వహించడం విశేషం. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
Also Read