పోసాని ఎవరి ఇంట్లో ఉంటున్నాడో తెలుసా!
on Aug 16, 2024
రచయితగా, దర్శకుడిగా, నటుడుగా, నిర్మాతగా తెలుగు సినిమా పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి పోసాని కృష్ణ మురళి(posani krishna murali)ఆయన స్క్రీన్ పై కనపడితే చాలు ప్రేక్షకులు తమకి తెలియకుండానే ఉత్సాహంతో విజిల్స్ వేస్తారు. కానీ అదంతా ఒకప్పుడు ఇప్పుడు మాత్రం పోసాని కనపడితే కొట్టాలి అనే స్థాయికి చేరాడనే మాటలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.అసలు విషయం ఏంటో చూద్దాం.
పోసాని గత ఎన్నికల్లో వైసిపీ పార్టీకి సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. అందులో ఎలాంటి తప్పు లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ చంద్రబాబు నాయుడు(chandrababu naidu) ని ,జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(pawan kalyan)ని నోటికి ఇష్టమొచ్చినట్టుగా తిట్టాడు.పైగా ఆ మాటలకి సభ్యసమాజం మొత్తం తలదించుకుంది. దాంతో పోసాని తన సినీ చరిష్మా మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సిఎంగా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సిఎం గా పవన్ ఉన్నారు.
దీంతో వారిద్దరి అభిమానులు తనని ఏమైనా చేస్తారేమో అని పోసాని భయపడుతున్నాడని, అందుకే ఒకే ఇంట్లో ఉండకుండా రకరకాల ఇల్లు తిరుగుతున్నాడని, అసలు ఎప్పుడు ఎవరి ఇంట్లో ఉంటున్నాడో కూడా తెలియటం లేదని సోషల్ మీడియాలో కొంత మంది చెప్తున్నారు. అదే విధంగా పాల అతను పేపర్ బాయ్ వచ్చినా కూడా భయపడ్తున్నాడని చెప్పుకొస్తున్నారు. అసలు భార్య కూడా వదిలేసి వెళ్లిపోయిందని మాట కూడా అంటున్నారు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా నిలుస్తున్నాయి.