మూడు లక్షలు కావాలంటే నేను చెప్పింది చేస్తారా..టాలెంట్ ఎవడి సొత్తు కాదు
on Aug 16, 2024
టాలెంట్ ఏ ఒక్కరి సొత్తూ కాదు.అవకాశం వదలొద్దు. సోషల్ మీడియా మీ హద్దు. ఇప్పుడు ఈ మాటలన్నీ మాస్ కా దాస్ విశ్వక్ సీన్(vishwak sen)చెప్తున్నాడు. పైగా అవి సినిమా డైలాగులు కాదు నిజమైన డైలాగులు. అసలు విషయం ఏంటో చూద్దాం.
హైదరాబాద్ నగరంలోని నెక్లెస్ రోడ్ అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ అయిన థ్రిల్ సిటీ ఆధ్వర్యంలో థ్రిల్లింగ్ ఇన్ ఫ్లూయన్సర్స్ చాలెంజ్(thrilling influencers challenge) కార్యక్రమం జరుగుతుంది. తాజాగా దానికి సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం విశ్వక్ సేన్ చేతుల మీదుగా జరిగింది.ఆ తర్వాత ఇన్స్పైరింగ్ స్పీచ్ ని కూడా ఇచ్చాడు. ప్రెజంట్ సోషల్ మీడియాపై ఆధారపడని వ్యవస్థ, వ్యాపార రంగమంటూ ఏదీ లేదు టాలెంట్ కూడా ఎవరి సొత్తూ కాదు. క్రియేటివిటీ కలిగిన ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా పట్టం కడుతుంది.కొత్తగా ప్రవేశించేవాళ్ళు కూడా బ్రహ్మాండంగా రాణించవచ్చని చెప్పాడు.
ఇక థ్రిల్లింగ్ ఇన్ ఫ్లూయన్సర్స్ చాలెంజ్ లో థీమ్ పార్క్ లోని ఫన్ గేమ్స్, అడ్వెంచర్ గేమ్స్, హార్రర్ మేజ్, 12D థియేటర్ లాంటి వందలాది యాక్టివిటీస్'ని బేస్ చేసుకుని వీడియో రీల్ చెయ్యాలి.ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యాలి. అలా పోస్ట్ చేసిన వీడియోల నుంచి మూడు అత్యుత్తమమైన వీడియో రీల్స్ ని ఎంపిక చేస్తారు. ఆ ముగ్గురికి తలా ఒక లక్ష చొప్పున మూడు లక్షల నగదు బహుమతిని అందిస్తారు. ప్రముఖ దర్శకుల చేతుల మీదుగా ఆ బహుమతిని అందివ్వడం జరుగుతుంది.
Also Read