ఐటమ్‌గాళ్ వెరీ వెరీ హాట్!!
on Dec 13, 2018

రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 'వినయ విధేయ రామ్'. టైటిల్ చాలా సాఫ్ట్‌గా, ట్రెడిషనల్‌గా వుంది కదూ! టైటిల్ ఎంత సాఫ్ట్‌గా వుందో... ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోయే హీరోయిన్ అంత హాట్! హిందీ హీరోయిన్ ఈషా గుప్తాను 'వినయ విధేయ రామ'లో ఐటమ్‌గాళ్‌గా ఎంపిక చేశారు. నిజానికి... 'ఇద్దరమ్మాయిలతో', 'సరైనోడు' సినిమాల్లో అల్లు అర్జున్ సరసన నటించిన కేథరిన్ ట్రెసాను బోయపాటి ఎంపిక చేశారని వార్తలొచ్చాయి. ఏమైందో ఏమో... ఆమెను తప్పించి, ఈషా గుప్తాను లైనులోకి తీసుకొచ్చారు. ఈషా గుప్తా పేరు వింటే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది హాట్ ఫొటోలే. ఆమె లింగరీ ఫోటోషూట్ ఒకటి విమర్శలకు కారణమైంది. విమర్శించిన వాళ్లపై ఈషా గుప్తా విరుచుకుపడ్డారు కూడా.

ఐటమ్ సాంగులో ఏ స్థాయిలో అందాల ప్రదర్శన చేస్తారో మరి!! ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ స్టూడియోలో వేసిన స్పెషల్ సెట్‌లో ఐటమ్ సాంగు తీస్తారట. ఇది కాకుండా సినిమాలో మరో సాంగ్ షూటింగ్ పెండింగులో వుందట. క్రిస్మస్ పండక్కి ముందు షూటింగ్ కంప్లీట్ చేయాలని బోయపాటి ప్లాన్ చేశారట. 'భరత్ అనే నేను' ఫేమ్ కీయరా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



