గాసిప్పు రాయుళ్ళ నోళ్ళు మూయించిన రెజీనా!
on Jul 12, 2016

ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో "నక్షత్రం" అనే సినిమాలో సందీప్ కు జోడీగా రెజీనా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. మొన్న రెజీనా పోలీస్ డ్రెస్ లో ఉన్న ఫోటో ఒకటి బయటకి వచ్చేసరికి సినిమాలో అమ్మడు లేడీ పోలీస్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ముఖ్యంగా.. గాసిప్పు రాయుళ్ళు "రెజీనా పవర్ ఫుల్ పోలీస్" రోల్ చేస్తుంది అని కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేశారు. కట్ చేస్తే.. ఈ సినిమాలో తాను పోలీస్ ను కాదని రెజీనా స్వయంగా వివరణ ఇచ్చి గాసిప్పు రాయుళ్ళ నోళ్ళు మూయించింది. ఈ సినిమాలోని ఓ సరదా సన్నివేశం కోసమే తాను ఇలా పోలీస్ గెటప్ వేసానే కానీ.. సినిమాలో తనది పోలీస్ పాత్ర కాదని, తన పాత్ర చాలా సహజంగా ఉంటుందని తెలియజేసింది. కన్నడ నటుడు సుదీప్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కూడా కీలకభూమికలో కనిపించనున్నాడు. కాజల్ గెస్ట్ రోల్ ప్లే చేయనుంది!
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



