మంచు బాబుతో మెగా పాప..!
on Jul 12, 2016

"శౌర్య, ఎటాక్" సినిమాల రిజల్ట్ తో బాగా డీలాపడిన మంచు మనోజ్ కొంత విరామానంతరం ఓ రోమాంటిక్ ఎంటర్ టైనర్ తో మన ముందుకురానున్నాడు. "నా రాకుమారుడు" ఫేమ్ సత్య దర్శకత్వంలో మంచు మనోజ్ ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారం. త్వరలో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రంలో కథానాయికగా "కంచె" ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ ను సెలక్ట్ చేసుకొన్నాట్లు సమాచారం. ఎప్పుడో "డేగ" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యకు మూడేళ్ళ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ సరసన నటించిన "కంచె"తోనే పేరొచ్చింది. ఆ తర్వాత అమ్మడు అవకాశాల కోసం ఎదురుచూసినప్పటికీ.. ఒక్కటి కూడా దొరకలేదు. అలాగే.. నాగార్జున "ఓమ్ నమో వెంకటేశాయ" చిత్రంలోనూ ఒక కీలకపాత్ర పోషిస్తోందని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే స్పీడవుతున్న ప్రగ్య కెరీర్ ఇదే జోరులో దూసుకుపోవాలని కోరుకుందాం!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



