వైజాగ్ లో వెంకీ బాక్సింగ్!
on Jul 12, 2016

"బాబు బంగారం" చిత్రీకరణ పూర్తి చేసిన వెంకీ ప్రస్తుతం గెడ్డం పెంచే పనిలో ఉన్నాడు. గెడ్డంతోపాటు జిమ్ లో తెగ కష్టపడిపోయి కండలు కూడా పెంచేస్తున్నాడు. ఇదంతా వెంకీ నటించబోయే తాజా చిత్రం కోసమేలెండి. హిందీలో ఘన విజయం సాధించిన "సాలా కడూస్" చిత్రాన్ని తెలుగులో వెంకీ రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. హిందీ వెర్షన్ కు దర్శకత్వం వహించిన సుధా కొంగర తెలుగు వెర్షన్ కు కూడా దర్శకత్వం వహించనుంది. ఇకపోతే.. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం వైజాగ్ పరిసరాల్లోనే జరిపేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తుకొంటున్నారు. హిందీ వెర్షన్ లో బాక్సర్ గా నటించిన రితికా సింగ్ తెలుగులోనూ తన పాత్రను తానే పోషిస్తోంది. సురేష్ బాబు ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరించనున్నారు. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



