దర్శకేంద్రుడి చేతుల మీదుగా "ఐ లవ్ యూ"
on Jul 13, 2017
తెలుగు డిజిటల్ మీడియా రంగంలో దూసుకుపోతున్న తెలుగువన్ యంగ్ టాలెంట్‌ని ప్రొత్సహించడంలోనూ అంతే ముందుంటుంది. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఎంతో మంది యువత తమను తాము నిరూపించుకునేందుకు అవకాశాన్ని ఇచ్చింది తెలుగువన్..మా ద్వారా పరిచయం అయిన ఎంతోమంది టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. ఒక్క షార్ట్ ఫిలిమ్సే కాదు ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌కు ఛాన్స్ ఇవ్వడంలోనూ అంతే నిబద్ధతతో వ్యవహరిస్తుంది తెలుగువన్..తాజాగా రాఘవేంద్ర వర్మ అనే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రూపొందించిన ఐ లవ్ యూ వీడియో సాంగ్‌ను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు తెలుగువన్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠమనేని రవిశంకర్. ఈ వీడియో సాంగ్‌లో ప్రియాంక లీడ్ రోల్‌లో నటించగా..సినిమాటోగ్రఫి: లాసా సతీష్, లిరిక్స్: మేడిచర్ల, సంగీతం: డాక్టర్ జోస్యభట్ల, దర్శకత్వం: రాఘవేంద్రవర్మ.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
