మైనే ప్యార్ కియా అంటున్న సాఫ్ట్ వేర్స్
on Nov 25, 2013
ప్రదీప్ బెట్నో, ఇషా తల్వార్, కోమల్ ఝా కలిసి నటిస్తున్న తాజా చిత్రం "మైనే ప్యార్ కియా". యూనిఫై సొల్యుషన్స్, మేరీల్యాండ్ పతాకంపై సాన వెంకట్రావ్, ఉపేంద్రకుమార్ గిరిడ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సినిమా గురించి దర్శకుడు ప్రదీప్ మాట్లాడుతూ... సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో సాగే యుత్ ఫుల్ లవ్ స్టొరీ ఇది. ఇది హిందీ "మైనే ప్యార్ కియా" కి రీమేక్ కాదు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది అని అన్నారు. నేటి నుండి హైదరాబాద్ లొని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో రెగ్యులర్ షూటింగ్ చేస్తామని నిర్మాత తెలిపారు.