ముంబై ఎయిర్ పోర్ట్ లో విజయ్ దేవరకొండ,రష్మిక..క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం అక్కడికే
on Dec 24, 2024
గీత గోవిందం,డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి హిట్ ఫెయిర్ గా పేరు తెచ్చుకున్న జంట విజయ్ దేవరకొండ(vijay devarakonda)రష్మిక(rashmika)ఈ ఇద్దరు లవ్ లో ఉన్నారనే వార్తలు చాలా కాలం నుంచి వినిపిస్తూనే ఉన్నాయి.తమ ప్రేమ విషయాన్ని ఇద్దరు కూడా బహిరంగంగా చెప్పకపోయినా, కొన్ని సంఘటనల ద్వారా మాత్రం ప్రేమ లో ఉన్నారనే విషయం అర్ధమవుతుంది.లేటెస్ట్ గా విడుదలైన పుష్ప 2(pushpa 2)మూవీని విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి రష్మిక చూడటం జరిగింది.ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి.దీంతో ఆ ఇద్దరు లవ్ లో ఉన్నారని అభిమానులు చెప్తుంటారు.ఇప్పుడు వాళ్ళ మాటలకి మరింత బలాన్ని ఇచ్చేలా ఒక సంఘటన జరిగింది.
నిన్న రాత్రి ముంబై ఎయిర్ పోర్ట్ లో ఆ ఇద్దరు ప్రత్యక్షమయ్యారు.రష్మిక ముందుగా విమానాశ్రయానికి చేరుకోగా,ఫొటోగ్రాఫర్లు ఆమెని చుట్టుముట్టి ఫోటోలు తీస్తున్నారు.ఆ తర్వాత కాసేపటికి విజయ్ అక్కడికి చేరుకున్నాడు.దీంతో ఇద్దరు కలిసి ఫోటోలు ఇవ్వడం జరిగింది.పెద్ద ఎత్తున అభిమానులు ఫోటోలు కూడా దిగారు.ఇక ఎక్కడికి వెళ్తున్నామనే విషయాన్నీ ఇద్దరు చెప్పకపోయినా, క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకి వెళ్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
కెరీర్ పరంగా చూసుకుంటే రష్మిక రీసెంట్ గా పుష్ప 2 తో 1500 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది.ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో,సికందర్, కుబేర,చావా వంటి పలు క్రేజీ ప్రాజక్ట్స్ లో చేస్తుంది.వీటిల్లో 'చావా' అతి త్వరలోనే థియేటర్స్ లో అడుగుపెట్టనుంది.ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన పన్నెండవ చిత్రంతో బిజీగా ఉన్నాడు. వరుస పరాజయాలతో ఉన్న విజయ్ కి ఇప్పుడు ఆ సినిమా హిట్ చాలా ముఖ్యం.