బిగ్ సర్ ప్రైజ్.. సంక్రాంతికి మోత మోగించనున్న వెంకీ మామ!
on Dec 24, 2024
స్టార్ హీరోలు అప్పుడప్పుడు తమ సినిమాల కోసం సింగర్స్ గా మారుతుంటారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి పలువురు స్టార్స్ తమ సినిమాల్లో పాటలు పాడారు. ఆ లిస్టులో వెంకటేష్ కూడా ఉన్నారు. గతంలో తాను హీరోగా నటించిన 'గురు' సినిమాలో 'జింగిడి జింగిడి' సాంగ్ పాడారు వెంకీ మామ. ఇప్పుడు ఆయన మరోసారి సింగర్ అవతారమెత్తుతున్నారు. (Venkatesh)
ఎఫ్-2, ఎఫ్-3 చిత్రాల తర్వాత వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunam). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టనుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది. ఇక ఈ సినిమాలో ఓ పాటను వెంకటేష్ ఆలపించినట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ పదాలతో ఎంతో ఎనర్జిటిక్ గా ఈ సాంగ్ ఉంటుందట. అంతేకాదు.. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిపై ఈ పాటను చిత్రీకరించినట్లు సమాచారం. న్యూ ఇయర్ కానుకగా ఈ సాంగ్ ని విడుదల చేసే అవకాశముంది. మొత్తానికి వెంకటేష్ పాడిన ఈ పాట, సంక్రాంతికి మోత మోగించడం ఖాయమని అంటున్నారు.
Also Read