పోలీసు స్టేషన్ లో పుష్ప
on Dec 24, 2024
పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం,ఆమె కుమారుడు శ్రీ తేజ్ హాస్పిటల్ లో ఉన్న విషయంపై అల్లు అర్జున్ పై కేసు నమోదు కాగా,మూడు వారాల కండిషన్ బెయిల్ పై అల్లు అర్జున్ బయట ఉన్న విషయం తెలిసిందే.
ఈ కేసులో అల్లు అర్జున్ కి బిఎన్ఎస్ సెక్షన్ 35 (3 ) కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు అల్లు అర్జున్ ని విచారణకి పిలవడం జరిగింది.దీంతో అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.ఆయన వెంట మామయ్య చంద్రశేఖర్ రెడ్డి,తండ్రి అల్లు అరవింద్ కూడా వెళ్లడం జరిగింది.రెండు గంటల పాటు జరిగే ఈ విచారణలో అల్లు అర్జున్ ద్వారా సంధ్య థియేటర్ ఘటన గురించి మరిన్ని వివరాలని పోలీసులు అడిగి తెలుసుకోనున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ స్టేట్ మెంట్ ని కూడా రికార్డు చేయనున్నారు.అల్లు అర్జున్ రాకతో చిక్కడపల్లి పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చెయ్యడం కూడా జరిగింది.ఇక అల్లు అర్జున్ ఈ కేసులో ఏ 11 గా ఉన్నాడు.
Also Read