పెళ్లయ్యాక కూడా అతనికి లేడీస్ ఫాలోయింగ్ బాగా ఉంది
on Nov 3, 2022

బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ యాక్టర్స్ నందు, రష్మీ ఇద్దరూ కలిసి "నిఖిల్ తో నాటకాలు" షోకి వచ్చి ఫుల్ మస్తీ చేశారు. నందు గురించి అడిగిన ప్రశ్నలకు రష్మీ కరెక్ట్ గా ఆన్సర్స్ ఇచ్చింది. నందు ఎప్పుడూ సందిగ్ధంలో ఉండడు..ఫుల్ క్లారిటీతో ఉంటాడు. అతనికి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నా చాలా ఎక్కువ మందిని మెయింటైన్ చేస్తున్నట్టుగా కనిపిస్తాడు. పెళ్లయ్యాక కూడా అతనికి బీభత్సమైన గర్ల్ ఫాలోయింగ్ అనేది ఉంది. నందుకి మంచి ప్రొడ్యూసర్ దొరికితే త్వరలో ఒక ఫిలిం కూడా డైరెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
నందుకు గీతామాధురి బ్యాంకు పాస్వర్డ్, ఫోన్ పాస్వర్డ్ అస్సలు తెలియదు. అలాగే నందు, గీత ఇద్దరూ ఒకరికొకరు తమకు వచ్చే మెస్సేజెస్ ని అస్సలు చెక్ చేసుకోరు. నందు, గీత డేటింగ్ కి వెళ్తారా అంటే అస్సలు వెళ్లారు.. " అని రష్మీ నందు గురించిన అన్ని విషయాలను చెప్పింది. "నందు తన న్యూడ్ వీడియోస్ లో పోస్ట్ చేస్తున్నాడు. అది మీరు చూడాలనుకుంటే 4 న రిలీజ్ కాబోయే బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీకి వెళ్లి చూడండి" అని నిఖిల్ కంక్లూషన్ తో మూవీకి మంచి ప్రొమోషన్ కూడా చేసాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



