15 రోజుల పాటు ఒకే నైటీతో నటించిన 'మహర్షి' తార!
on Nov 3, 2022

సన్నీ వేన్, అలెన్సియర్, అనన్య నటించిన మలయాళం మూవీ 'అప్పన్'. ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'అప్పన్'కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో హీరో సన్నీ వేన్ బార్య రోజీ పాత్రలో అనన్య నటించింది. ప్రజలు ఎదుర్కొనే అనేక సమస్యలను ఈ చిత్రం కళ్లకు కట్టినట్లు చూపించింది. తండ్రే కుటుంబానికి శత్రువుగా మారితే ఏం జరుగుతుందనేది సినిమాలోని ప్రధానాంశం. సినిమాలో అందరి నటన అద్భుతంగా ఉందనే పేరు వచ్చింది.
సినిమా చూసిన తర్వాత కూడా 'అప్పన్'లోని చాలా పాత్రలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఈ చిత్రంలో అనన్య ఇప్పటివరకు మనం చూడని పాత్రలో కనిపించింది. ఆ పాత్రను ఆమె ఉన్నత స్థాయిలో పోషించింది. ఇప్పుడు రోజీ పాత్ర గురించి అనన్య చెప్పిన మాటలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కనీసం పదిహేను రోజుల పాటు సెట్‌లో ఒకే నైటీని ధరించాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. మొదటి సీన్ నుండి దాదాపు 15 రోజుల పాటు ఒకే నైటీతో ఆమె నటించింది. లేటెస్ట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనన్య ఈ విషయాన్ని వెల్లడించింది.
తన మెట్టింట్లో అందరినీ ఒక చోట చేర్చే పాత్ర రోజీది. ప్రతి విషయంలో తనదైన అభిప్రాయాలు కలిగి ఉండే పాత్ర. క్యారెక్టర్‌కు కంటిన్యుటీ మెయింటైన్ చేయడం అవసరం. డైరెక్టర్ మజు మొదట ముఖానికి కరివేపాకు పూసుకోమన్నాడని అనన్య సరదాగా చెప్పింది.
స్వతహాగా మలయళీ నటి అయిన అనన్య తమిళ డబ్బింగ్ ఫిల్మ్ 'జర్నీ' ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ మూవీలో శర్వానంద్ జోడీగా ఆమె కనిపిచింది. ఆ తర్వాత 'అ ఆ' చిత్రంలో నితిన్ చెల్లెలిగా, 'మహర్షి' మూవీలో అల్లరి నరేశ్ జోడీగా నటించి ఆకట్టుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



