ఆర్మీలోకి వెళ్లే అవకాశం పోయింది..పోలీస్ ఆఫీసర్ ని కూడా కాలేకపోయాను
on Nov 3, 2022

నటి స్నిగ్ద ఒక టిపికల్ క్యారెక్టర్. ఎన్నో మూవీస్ లో నటించింది. "అలా మొదలైంది" మూవీలో స్నిగ్ద నటన మాములుగా ఉండదు. ఫుల్ జోష్ తో ఉంటుంది. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఐతే స్నిగ్దని చూసిన వారెవరైనా ముందు అబ్బాయే అనుకుంటారు కానీ పేరు విన్నాక తెలుస్తుంది అమ్మాయి అని. అలాంటి స్నిగ్ద ఒక ఇంటర్వ్యూలో తన గురించి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది " నాకు కిరణ్ బేడీ అంటే ఆదర్శం. ఒక సెమినార్ లో నేను ఆవిడతో ఫోటో దిగాను కూడా. ఎవరైనా మమ్మల్ని చూస్తే తల్లీ కూతుళ్ళం అనే అనుకుంటారు. నాకు జుట్టు అంటే అస్సలు ఇష్టం ఉండదు. నాకు ఎలా కంఫర్ట్ గా ఉంటుందో అలాగే ఉంటాను. హడావిడిగా రెడీ అవడం, అన్ని వేసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. నాకు సింపుల్ గా ఉంటేనే చాలా నచ్చుతుంది.
ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళ్లాల్సి వస్తే నేను నాన్న ఇద్దరం కలిసి సూట్ కొనుక్కుని ఎంచక్కా వేసుకెళ్తాం. ఇక ఎంబీఏలో గోల్డ్ మెడల్ వచ్చింది. అది భయంతో తెచ్చుకున్న గోల్డ్ మెడల్. నాకు ఈ కాంపిటీషన్ స్పిరిట్ అనేది ఉండదు. కానీ పరీక్షల్లో ఫెయిల్ అవుతానని మూడు నెలల ముందుగానే అన్నీ చదివేసుకునేదాన్ని అలా వచ్చింది గోల్డ్ మెడల్. ఐతే నేను మొదట ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనుకున్నా కానీ నాకు ఆస్మా ఉన్న కారణంగా అందులో సెలెక్ట్ అవలేదు, పోలీస్ ఆఫీసర్ ని కావాలి అనుకున్నా కాలేకపోయాను..చివరికి ఇలా మూవీస్ లోకి రావాల్సి వచ్చింది" అని చెప్పింది స్నిగ్ద..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



