పూనమ్ కౌర్ 'శక్తి ఔర్ సంస్కృతి' కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ ప్రశంస!
on Apr 2, 2025
ప్రేక్షకులకు వినోదంతో పాటు, విజ్ఞానాన్ని అందిస్తూ వినూత్న కార్యక్రమాలతో అలరించే తెలుగువన్ యూట్యూబ్ ఛానల్.. మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రముఖ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) వ్యాఖ్యాతగా 'శక్తి ఔర్ సంస్కృతి' కార్యక్రమాన్ని తెలుగువన్ తలపెట్టింది. స్త్రీ శక్తిని, భారతదేశ సంస్కృతిని గౌరవిస్తూ.. ఈ తరంలో స్ఫూర్తి నింపేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. (Shakti and Samskruthi)
'శక్తి ఔర్ సంస్కృతి' లాంటి గొప్ప కార్యక్రమానికి తెలుగువన్ శ్రీకారం చుట్టడం పట్ల తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా 'శక్తి ఔర్ సంస్కృతి' లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తెలుగువన్ టీంని ప్రశంసించారు. మహిళలకు సాధికారత కల్పించడం, సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యత అని గుర్తు చేసిన జిష్ణుదేవ్.. 'శక్తి ఔర్ సంస్కృతి' లాంటి కార్యక్రమాలు అందుకు దోహదపడతాయని అన్నారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
