'వారియర్'గా మారిన ఉస్తాద్ రామ్!
on Jan 17, 2022
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కొంతకాలంగా మాస్ సినిమాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మాస్ కి దగ్గరైన రామ్ అప్పటినుంచి తన రూట్ మార్చాడు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ తాజాగా రివీల్ చేశారు మేకర్స్.
రామ్- లింగుస్వామి కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాకి 'ది వారియర్' అనే పెట్టారు. ఈ మూవీలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన రామ్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. చేతిలో గన్ పట్టుకొని పోలీస్ యూనిఫామ్ లో రామ్ లుక్ పవర్ ఫుల్ గా ఉంది. 'ఇస్మార్ట్ శంకర్' తో ఉస్తాద్ రామ్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్.. 'ది వారియర్' సినిమాతో ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి 'ది వారియర్' సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.