మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టికి కరోనా
on Jan 16, 2022

సినీ సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, కీర్తి సురేష్, త్రిష, మీనా ఇలా ఎందరో కరోనా బారిన పడగా.. తాజాగా మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టికి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.
"అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కొంచం జ్వరంగా ఉంది కానీ నేను బాగానే ఉన్నాను. వైద్యుల సూచనలతో ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. అన్నివేళలా మాస్క్ ధరించండి, జాగ్రత్తగా ఉండండి" అని మమ్ముట్టి ట్వీట్ చేశారు.
మమ్ముట్టి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



