బ్రహ్మీ పుస్తకం రాస్తున్నాడు
on Dec 3, 2014
టాలీవుడ్ లో కామెడీ కింగ్ ఎవరంటే.. బ్రహ్మానందం పేరే చెప్పాలి. ఏ సినిమా చూసినా ఆయనే. ఆయన పాత్ర క్లిక్ అయితే సినిమా హిట్టే. సెకండాఫ్ అంతా సినిమాని భుజాలవై వేసుకొని నడిపించేసే సత్తా ఉంది. పిండుకొనే సత్తా ఉండాలేగానీ.. ఎన్ని నవ్వులైనా అందిస్తారాయన. అత్యధిక సినిమాల్లో నటించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా ఆయనదే. త్వరలోనే 1000 సినిమాల మైలు రాయి చేరుకోబోతున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మీ ఓ పుస్తకం రాయనున్నట్టు సమాచారం. ఇది ఆయన జీవిత కథ. ఈ 1000 సినిమా ప్రయాణాన్ని ఆయన అక్షర రూపంలో పొందుపర్చనున్నారు. బ్రహ్మీకి అందరితోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన అజాత శత్రువు కూడా. అందుకే ఈ పుస్తకం ద్వారా విలువైన, ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయనఖాళీ సమయాల్లో కలం ఝులిపిస్తున్నారని టాక్. త్వరలోనే ఈ పుస్తకం గురించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. బ్రహ్మీ నటనే కాదు, అక్షరాలూ నవ్విస్తాయేమో చూడాలి.