కొణిదెల ప్రొడక్షన్స్‌లో అఖిల్ సినిమా!!
on Nov 27, 2018

కొణిదెల ప్రొడక్షన్స్ లో వరుసగా చిత్రాలు ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి నిర్మితవుతోన్న విషయం తెలిసింది. దీని తర్వాత ఇదే బేనర్ లో కొరటాల శివతో ఒక సినిమా మెగాస్టార్ తో ఒక సినిమాను చేస్తున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ , బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం చివరి దశలో ఉంది. అయితే బోయపాటి దర్శత్వంలో అఖిల్ హీరోగా కొణి దెల ప్రొడక్షన్స్ లో ఒక సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్.
ప్రస్తుతం అఖిల్ తన మూడవ చిత్రంగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జనవరిలో రిలీజ్ కానుంది. అయితే తన నాలగవ సినిమాగా కొణిదెల ప్రొడక్షన్స్ లో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే మాస్ డైరక్టర్ బోయపాటి ఒక పక్కా మాస్ మసాలా కథని అఖిల్ కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మార్చి నెలలో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బోయపాటి , రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తోన్న `వినయ విధేయ రామ` చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



