యంగ్ ఎన్టీఆర్‌గా యంగ్ టైగర్
on Nov 27, 2018

పేరులో మాత్రమే కాదు... పోలికల్లోనూ, నటనలోనూ తాతకు తగ్గ మనవడు అని జూనియర్ ఎన్టీఆర్ అనిపించుకున్నారు. ఇప్పుడు తాత బయోపిక్‌లో నటిస్తున్నాడు. నిజమే... నందమూరి తారక రామారావు జీవితకథతో రూపొందుతున్న 'యన్.టి.ఆర్'లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా... యంగ్ ఎన్టీఆర్ పాత్రలో యంగ్ టైగర్ కనిపించనున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో రెండు రోజులుగా యంగ్ టైగర్ మీద సన్నివేశాలు చిత్రీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. హరికృష్ణ మరణం తరవాత నందమూరి కుటుంబానికి ఎన్టీఆర్ మరింత దగ్గరయ్యాడు. అతడి 'అరవింద సమేత వీర రాఘవ' విజయోత్సవానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య సత్సంబంధాలు వున్నాయని చెప్పడానికి ఈ వార్త మరో ఉదాహరణ. సినిమాలో యంగ్ టైగర్ పాత్ర నిడివి ఎంత వుంటుంది? ఏయే సన్నివేశాల్లో కనిపిస్తాడు? అనేవి తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



