చచ్చిన పామును చంపుతారెందుకు? - వర్మ
on Nov 27, 2018

'ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి' అన్నాడో కవి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మది అటువంటి వర్గమే. ఆయన ఎప్పుడూ ఓటమి ఒప్పుకోరు. "నాకు నచ్చినట్టు సినిమా తీశా. మీకు ఇష్టమైతే చూడండి. లేదంటే మానేయండి" అని చెప్పిన సందర్భాలు బోలెడు. సినిమా పరాజయమైనా... ఆయన మాటల్లో పొగరు కనిపించేది. అటువంటి వర్మ తొలిసారి ఓటమిని అంగీకరించారు. 'ఆఫీసర్' డిజాస్టర్ అని ఒప్పుకున్నారు. అంత కంటే ఆశ్చర్యకరమైన విషయం ఒకటి వుంది. 'ఆఫీసర్' పరాజయం గురించి వరుస ప్రశ్నలు ఎదురైతే.. "చచ్చిన పామును మళ్లీ మళ్లీ ఎందుకు చంపుతారు" అని వ్యాఖ్యానించారు. వర్మ మీడియాతో వ్యవహరించే తీరులోనూ ఎంతో మార్పు కనిపించింది. సినిమాల విషయంలో మాత్రం ఎప్పటిలా సమాధానాలు ఇచ్చారు.
'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా బాలకృష్ణపై కోపంతో తీయడం లేదనీ, తనకు ఎన్టీఆర్ బయోపిక్ 'యన్.టి.ఆర్' చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇవ్వలేదనే అక్కసు అసలు లేదని వర్మ వ్యాఖ్యానించారు. తనకు తొలి నుంచి ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన తరవాత ఏమైందనే అంశం మీద ఆసక్తి అని తెలిపాడు. సినిమా స్క్రిప్ట్ లక్ష్మీపార్వతికి చూపించే ప్రసక్తి లేదని వర్మ అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



