'ఇంద్ర'తో 'గేమ్ ఛేంజర్'కి లింక్.. థియేటర్లు షేక్ అవుతాయి...
on Sep 30, 2024
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ 'ఇంద్ర'తో లింక్ ఉంది.
చిరంజీవి (Chiranjeevi) హీరోగా రెండు దశాబ్దాల క్రితం వచ్చిన 'ఇంద్ర' సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇందులో పాటలు కూడా ఒక ఊపు ఊపాయి. ముఖ్యంగా 'దాయి దాయి దామ' సాంగ్ లో చిరంజీవి వేసిన వీణ స్టెప్.. టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ స్టెప్స్ లో ఒకటిగా నిలిచింది. అలాంటి వీణ స్టెప్ ని 'గేమ్ ఛేంజర్'లో రామ్ చరణ్ రీ క్రియేట్ చేశాడు.
థమన్ సంగీతం అందిస్తున్న 'గేమ్ ఛేంజర్' నుంచి.. ఇప్పటికే 'జరగండి' సాంగ్ విడుదల కాగా, తాజాగా 'రా మచ్చా మచ్చా' సాంగ్ విడుదలైంది. థమన్ ఎనర్జిటిక్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ లో.. "వీణ స్టెప్ వేస్తే మీ విజిల్ సౌండ్ దడ్ దడా.. నక్కినాది గుండెలో ఏదో మూల" అంటూ అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఆ లిరిక్ కి చరణ్ వీణ స్టెప్ వేస్తున్న స్టిల్స్ ని కూడా లిరికల్ వీడియోలో రివీల్ చేశారు. (Raa Macha Macha Song)
ఇప్పటిదాకా ఇంద్ర వీణ స్టెప్ ని ఎందరో రీ క్రియేట్ చేశారు. అయితే చిరు తనయుడు చరణ్ చేస్తే.. థియేటర్లలో ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో ఊహలకు కూడా అందదు. ముఖ్యంగా మెగా అభిమానులు పండగ చేసుకుంటారు. మరి ఈ వీణ స్టెప్ ని చరణ్ తో రీ క్రియేట్ చేయించాలనే ఆలోచన ఎవరిదో కానీ, థియేటర్లు షేక్ అవుతాయి అనడంలో డౌట్ లేదు.
'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ లో ఈ సినిమా నుంచి టీజర్ తో పాటు, థర్డ్ సింగిల్ రిలీజ్ కానున్నాయి.
Also Read