రెండు తెలుగు రాష్ట్రాల్లో గీతా ఆర్ట్స్ ద్వారా శ్రీ విష్ణు స్వాగ్ రిలీజ్
on Sep 30, 2024
లేటెస్ట్ గా వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో శ్రీ విష్ణు. ఇప్పుడు స్వాగ్ అనే వినూత్నమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పైగా రాజ రాజ చోర తర్వాత శ్రీవిష్ణు(sree vishnu)దర్శకుడు హసిత్ గోలి(hasith goli)కాంబినేషన్ లో తెరకెక్కుతుండంతో అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి.
అక్టోబర్ 4 న విడుదల కాబోతున్న ఈ మూవీకి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కులని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ దక్కించుకుంది. దీంతో స్వాగ్ మీద అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. గీత ఫిలిం అధినేత అల్లు అరవింద్(allu aravind)విజయాలకి కేర్ ఆఫ్ అడ్రస అనే విషయం అందరకి తెలిసిందే. స్వాగ్ లో శ్రీ విష్ణు సరసన రీతూ వర్మ(ritu varma)జోడి కట్టగా మీరా జాస్మిన్ ,దీక్ష, రవిబాబు, సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వ ప్రసాద్ నిర్మించాడు.
Also Read