అన్నయ్యని పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిని చేస్తున్నాడా!
on Sep 30, 2024
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)సోదరుడు నాగబాబు(nagababu)కి నటుడుగానే కాకుండా నిర్మాతగానూ సినీ పరిశ్రమతో సుదీర్ఘ కాలంగా అనుబంధం ఉంది.చిరంజీవితో రుద్రవీణ లాంటి సినిమాని తెరకెక్కించి జాతీయ అవార్డుని కూడా పొందాడు. 2019 లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ లో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ జాతీయ స్థాయిలో ఆ పార్టీకి జనరల్ సెక్రటరీ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు.
మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేస్తాడనే వార్తలు చాలా బలంగానే వినిపించాయి. కానీ చివరి నిమిషంలో బిజెపీ పార్టీ నుంచి సీఎం రమేశ్ పోటీ చేసాడు.కానీ ఇప్పుడు నాగ బాబు కి పవన్ కళ్యాణ్ ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు మూడు సీట్లు ఖాళీ అయ్యాయి. ఇందులో ఒకటి నాగబాబుకు ఇవ్వనున్నారని టాక్ నడుస్తోంది.ఎమ్మెల్యేల బలం రీత్యా ప్రస్తుతం అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే ఈ మూడు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి.పైగా కేవలం రాజ్యసభ సీటు మాత్రమే కాకుండా నాగబాబు కి కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగానూ చోటు కల్పిస్తారని నాగబాబు కోసమే ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ క్యాబినెట్ లో చేరలేదని కూడా అంటున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు విషయంలో జరిగిన అపచారానికి వేంకటేశ్వరుడిని క్షమాపణలు వేడుకుంటూ కొన్ని రోజుల క్రితం ప్రాయచ్చిత దీక్షని తీసుకున్న విషయం తెలిసిందే.ఈ మేరకు ఈ నెల రెండున తిరుపతి వెళ్లి స్వామిని దర్శించుకుని మూడవ తేదీన దీక్ష విరమణ కూడా చెయ్యనున్నారు.
Also Read