పెళ్లి గురించి రామ్ ఏమంటున్నాడంటే?
on May 15, 2020
యంగ్ హీరో నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు. త్వరలో నితిన్ కూడా చేసుకుంటాడు. కరోనా ప్రభావం లేకపోతే, అసలు రాకపోతే ఈపాటికి ఏడడుగులు వేసేవాడు. సంబంధం కుదిరింది కాబట్టి ప్రస్తుత పరిస్థితులు సద్దుమణిగాక చేసుకుంటాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకడైన రానా దగ్గుబాటి కూడా 'పడ్డానండి ప్రేమలో మరి' అని తనకు కాబోయే శ్రీమతి మిహీకా బజాజ్‌ను సోషల్ మీడియా సాక్షిగా పరిచయం చేశారు. యుంగ్ హీరోల లిస్టులో పెళ్లి కానీ ప్రసాద్ లు ఒక్కొక్కరూ సెటిల్ అవుతున్నారు. మరి, యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ సంగతి ఏంటి? అతడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? ప్రేక్షకులు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అదే ప్రశ్న అతడిని అడిగితే ఏమంటున్నాడో తెలుసా?
పెళ్లి కంటే ఒంటరితనమే మేలు అనే అర్థం అతడి ధ్వనిస్తోంది. "ప్రస్తుతానికి ఇలా (ఒంటరిగా) ఉంటేనే బావుంటుందని అనిపిస్తోంది. ప్రేమ, పెళ్లి అనేవి మన చేతుల్లో ఉండవు. సమయం వచ్చినప్పుడు జరగాల్సినవి అన్నీ జరిగిపోతాయి" అని రామ్ సెలవిచ్చారు. పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చెప్పిన మాటలు ఇవి. ప్రతి ఏడాది అభిమానుల మధ్య పుట్టినరోజులు చేసుకొనే రామ్, ఈసారి అభిమానులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దని, అందరూ భౌతిక దూరం పాటిస్తూ ఎవరి ఇళ్లలో వారు ఉండడమే తనకు నిజమైన బహుమతి అని చెప్పారు.