చిరంజీవితో 'రౌడీ అల్లుడు' లాంటిది చేయాలని...
on May 2, 2020

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ 'గబ్బర్ సింగ్' తీశారు. ఇప్పుడు మరో సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు. మెగా ఫ్యామిలీలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో 'దువ్వాడ జగన్నాథమ్ - డీజే', వరుణ్ తేజ్‌తో 'గద్దలకొండ గణేష్', సాయి ధరమ్ తేజ్‌తో 'సుబ్రమణ్యం ఫర్ సేల్' చేశారు. పవన్‌తో మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవితోనూ సినిమా చేయడానికి హరీష్ శంకర్ రెడీ అవుతున్నారట. మరి, ఈ దర్శకుడు ఏమంటున్నారో తెలుసా?
"చిరంజీవిగారితో సినిమా చేయడమనేది నా జీవిత లక్ష్యం. కళ్యాణ్ గారితో సినిమా ఉంటుంది. అలాగే, మెగాస్టార్ సినిమా కూడా తప్పకుండా ఉంటుంది. ఆయనతో 'రౌడీ అల్లుడు' లాంటి వాణిజ్య హంగులతో కూడిన వినోదాత్మక సినిమా చేయాలని ఉంది" అని హరీష్ శంకర్ అన్నారు.
మెగా బ్రదర్స్ సినిమాలతో పాటు రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా చేయాలని ఉందనీ, అతడితో సినిమా చేస్తే మెగా హీరోలు అందరినీ కవర్ చేసిన సంతృప్తి వస్తుందని 'గబ్బర్ సింగ్' దర్శకుడు మనసులో కోరికను బయటపెట్టారు. అంతా బాగుంది గానీ... మెగా ఫ్యామిలీలో అల్లువారి చిన్న కొడుకు పేరును ఆయన మర్చిపోయారు. అల్లు శిరీష్ కూడా హీరోగా సినిమాలు చేస్తున్నారు కదా!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



