'రాక్షసుడి' కోసం వస్తున్న ప్రభాస్
on May 15, 2015
తమిళ సూపర్ స్టార్ సూర్య, నటించిన లేటెస్ట్ సినిమా మాస్. ఇది ఇప్పుడు తెలుగులోకి రాక్షసుడుగా వస్తోంది. ఈ సినిమా అడియో ఫంక్షన్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫంక్షన్ కు హీరో ప్రభాస్, దర్శకుడు రాజమౌళి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నారు. బాహుబలి తమిళ హక్కుల ద్వారా జ్ఞాన్ వేల్ రాజా వీరికి సన్నిహితడైపోయారు. అందుకే ఆయన సినిమా ఫంక్షన్ కు వీరు అతిధులుగా వస్తున్నారు.
ఈ సినిమాలో సూర్యకు నయనతార, ప్రణీతలు జంటగా నటిస్తున్నారు. విభిన్న కథాంశాలతో, కథనాలతో వరుస విజయాలు సాదించిన దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకుడు. యువన్‌శంకర్ రాజా అందించిన ఆడియో ఈనెల 18న శిల్పకళావేదిక లో అభిమానుల మద్య సిని పరిశ్రమలోని ప్రముఖు అగ్రహీరోలు, దర్శకుల సమక్షంలో ఆడియో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు లో మేధా క్రియోషన్స్ అధినేతలు మిరియాల రాజాబాబు(కృష్ణారెడ్డి), మిరియాల రవిందర్ రెడ్డి లు విడుదల చేస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ మాట్లాడుతూ."సూర్య, నయనతార, ప్రణీతలు జంటగా, వెంకట్ ప్రభు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'రాక్షసుడు' మే 29న విడుదల చేస్తున్నాము. సూర్య పాత్ర చాలా డిఫరెంట్ గా డిజైన్ చేయ్యటం జరిగింది. తెలుగులో రాక్షసుడు అనే టైటిల్ పెట్టటమే ఈ చిత్రం ఎంత వైవిధ్యంగా వుండబోతుందో చెబుతున్నాము. ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలో విడుదల చేశాము. చాలా హ్యజ్ రెస్పాన్స్ వస్తుంది. తెలుగు లో సూర్య గారికి ఓ ప్రత్యేఖమైన ఇమేజ్ వుంది. తెలుగు లో ఆయన చేసిన ప్రతిచిత్రానికి భారీ ఓపెనింగ్స్ ఇస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య గారు తెలుగు ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేస్తారు. ఇది మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కింది. సూర్య, నయనతార కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు చాలా పెద్ద విజయాలు సాదించాయి. తిరిగి వీరిద్దరి కాంబినేషన్ అనగానే అంచనాలు భారీగా వుంటాయి. అందరి అంచనాలు అందుకునేలా ఈచిత్రం వుంటుంది. దర్శకుడు వెంకట్ ప్రభు చేసిన ప్రతి చిత్రం కొత్త గా వుంటుంది. ఆయన ఎంచుకునే కాన్సెప్ట్ లు జనరంజకంగా వుంటాయి. ఇప్పుడు రాక్షసుడు చిత్రంతో మరో కొత్త కాన్స్‌ప్ట్ తో వస్తున్నారు. ఇది ఆయన డైరక్ట్ చేస్తున్న ఆరవ చిత్రం. సంగీతంలో కొత్త ఒరవడి క్రియోట్ చేసిన యువన్‌శంకర్ రాజా సంగీతాన్ని అందిచారు. ఈ సూపర్బ్ ఆడియో ని మే 18న అభిమానుల మద్యన, ప్రముఖ అగ్రహీరోల, దర్శకుల సమక్షంలో విడుదల చేస్తున్నాము." అని అన్నారు
తెలుగు వెర్షన్ పంపిణిదారులు మేదా క్రియోషన్స్ అధినేతల్లో ఒకరు మిరియాల కృష్ణారెడ్డి మాట్లాడుతూ" సూర్య గారు నటించిన 'రాక్షసుడు' చిత్రం తెలుగు వెర్షన్ ని మాకు ఇచ్చిన కె.ఇ.జ్ఞానవేల్ గారికి మా ప్రత్యేఖ దన్యవాదాలు. ఈ చిత్రం మేదా రిలీజ్ ద్వారా విడుదల చేస్తున్నాము. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా సూపర్బ్ గా వుంటుంది. నయనతార, ప్రణీత లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా అందించిన ఆడియో ని మే 18 న శిల్పకళావేదిక లో ఘనంగా విడుదల చేస్తున్నాము. ఈకార్యక్రమాని ప్రముఖ అగ్ర హీరో, దర్శకుడు చేతుల మీదుగా ఆడియో ని విడుదల చేయనున్నాము. అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసి మే 29న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం." అని అన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
