'బాహుబలి' యుద్ధ వీరుడిగా కట్టప్ప
on May 15, 2015
మిర్చి’ సినిమాలో ప్రభాస్ తండ్రిగా నటించిన వ్యక్తి గుర్తున్నాడా మీకు? ఆయన పేరు సత్యరాజ్. తెలుగు, తమిళ, హిందీ భాషలలోని పలు చిత్రాలలో నటించారు. ఇప్పుడు ప్రస్తుతం బాహుబలి లో నటిస్తున్నారు. దర్శకుడు రాజమౌళి శుక్రవారం ఆయన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సత్యరాజ్ కట్టప్పగా కనిపించారు. "జీవితాంతం నిజాయితీకి మారు పేరుగా జీవించిన కట్టప్ప,ఆ నిజాయితి అతన్ని గర్వంగా చెప్పుకునేలా నిలబెట్టిందా లేకా అదే నిజాయితి అతన్ని బలి తీసుకుందా" అని ట్వీట్ లో తెలిపారు రాజమౌళి. కట్టప్ప వెనకాల బ్యాక్ గ్రౌండ్ కూడా పెద్ద యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లతో బాహుబలి మీద అంచనాలు పెరిగాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
