మంచు వారింట్లో బాలయ్య, చిరుల సందడి
on May 15, 2015
మంచు వారింట్లో పెళ్లి సందడి మొదలయ్యింది. మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ వివాహం ఈనెల 20న జరగనున్న విషయం తెలిసిందే. అయితే నిన్న జరిగిన మనోజ్ పెళ్ళికొడుకు వేడుకకు మెగాస్టార్, నందమూరి నటసింహం హాజరై సందడి చేయడం ఫంక్షన్ కే హైలైట్ గా మారింది. ఒకరినొకరు ప్రేమగా పలకరించుకుంటూ, ఒకరి భుజాలపై ఒకరు చేయి వేసుకొని జోకులు పేలుస్తుంటే ఫంక్షన్ అంతా సందడిగా మారింది. ఫంక్షన్ కి వచ్చిన అతిథులంతా వీరినే చూస్తూ వుండిపోవడం విశేషం. ఈ ఫోటోని చూడండి అది నిజమో కాదో మీకే తెలిసిపోతుంది!!!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
