ప్రభాస్ అన్న చేయాలి... నేనింకా బచ్చాగాడినే!
on Oct 16, 2019

ఆర్నాల్డ్ ష్వార్జనెగ్గర్ నటించిన హిట్ ఫిల్మ్ ఫ్రాంచైజీ ‘టెర్మినేటర్’ తరహా యాక్షన్ సినిమాలు ప్రభాస్ అన్న చేయాలనీ... చేస్తే బాగుంటుందనీ... అటువంటి సినిమాలు చేయడానికి నేనింకా బచ్చాగాడినే అనీ యంగ్ సన్సేషనల్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అన్నారు. ఐదారేళ్ళ తరవాత అటువంటి సినిమాలు వస్తే చూద్దామన్నారు. ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్’ తెలుగు ట్రైలర్‌ను బుధవారం ఉదయం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ మీరు పూర్తిస్థాయి యాక్షన్ సినిమా చేయలేదు. ఎప్పుడు చేస్తారని అడగ్గా... ‘‘పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా యాక్షన్ సినిమాయే’’ అన్నారు విజయ్ దేవరకొండ. ఆ సినిమా కోసం సిక్స్‌ప్యాక్ చేయాలనుకుంటున్నాననీ... ఏం జరుగుతుందో చూద్దామనీ అన్నారు. తెలుగులో హాలీవుడ్ సినిమాలను డబ్బింగ్ చేయడం గురించి మాట్లాడుతూ ‘‘సాధారణంగా నేను హాలీవుడ్ సినిమాలను ఇంగ్లిష్‌లో చూస్తాను. తెలుగులో ‘300’ చూశా. విచిత్రంగా ఉంది డబ్బింగ్. ఇప్పుడు చాలా క్వాలిటీగా చేస్తున్నారు. డిస్నీ వాళ్లు తెలుగులో హాలీవుడ్ సినిమాలను డబ్బింగ్ చేసినట్టు, మన ‘సైరా’, ‘సాహో’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



