తెలుగు సినిమాకి కొత్త తండ్రి ఆ హీరో రూపంలో రాబోతున్నాడా!
on Feb 28, 2024
సిల్వర్ స్క్రీన్ మీద మెరవబోయే కొన్ని కొన్ని కాంబినేషన్స్ పేరు వింటే చాలు ప్రేక్షకులకి ఆ సినిమాల మీద ఎంతో ఆసక్తి ఏర్పడుతుంది. లేటెస్ట్ గా అలాంటి ఆసక్తిని నెలకొల్పే కాంబినేషన్ ఒకటి ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది . ఆ కాంబో సెట్ అవ్వాలేగాని తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయం.
శర్వానంద్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న మూవీ కూడా ఒకటి ఉంది. పీరియాడిక్ ఫ్యామిలీడ్రామా తో తెరకెక్కుతున్న ఆ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇందులోనే శర్వానంద్ ఫాదర్ క్యారక్టర్ లో సీనియర్ హీరో రాజశేఖర్ నటించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. మేకర్స్ ఆల్రెడీ రాజశేఖర్ ని సంప్రదించారని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. మరికొన్ని రోజుల్లో అందుకు సంబంధించిన అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. రెండు డిఫరెంట్ వేరియేషన్స్ తో ఆయన క్యారక్టర్ ఉండబోతుందని తెలుస్తుంది.
రాజశేఖర్ కనుక ఫాదర్ క్యారక్టర్ చెయ్యడం ఖాయమైతే ఇక సినిమా ప్రియులకి పండగే అని చెప్పవచ్చు. తెలుగు సినిమా కి సరికొత్త ఫాదర్ కూడా దొరికినట్టు అవుతుంది. రీసెంట్ గా నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ లో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించారు. లూజర్ వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి జీబ్రాన్ సంగీతాన్ని అందిస్తుండగా మాళవిక నాయర్ హీరోయిన్ గా చేస్తుంది.
Also Read