ప్రశాంత్ నీల్ అభిమాన దర్శకుడు తెలుగు నటుడు కూడా
on Feb 27, 2024
కేజిఎఫ్, కేజిఎఫ్ 2 ,సలార్ లతో ఇండియా వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇండియన్ సినీ పరిశ్రమలో ఉన్న చాలా మంది బిగ్ హీరోస్ ప్రశాంత్ దర్శకత్వంలో సినిమా చెయ్యడానికి ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి డైరెక్టర్ కి ఫేవరేట్ డైరెక్టర్ ఎవరో తెలుసా!
ప్రశాంత్ నీల్ కి ప్రముఖ కన్నడ దర్శకుడు ఉపేంద్ర సినిమాలంటే చాలా ఇష్టమట. ఆయనలా ఎవరు సినిమాని తెరకెక్కించలేరని తన ఫేవరేట్ డైరెక్టర్ కూడా ఉపేంద్రనే అని చెప్పాడు. ఉపేంద్రగారు కథ చెప్పే విధానం వాటిని తెర మీద నడిపించే విధానం చాలా వెరైటీ గా ఉంటాయని అసలు ఆ విధంగా కూడా ఒక సినిమాని చెయ్యవచ్చా అని అనిపిస్తుందని అన్నాడు. ఓం, A , ఉపేంద్ర, ష్ సినిమాలే అందుకు ఉదాహరణ అని కూడా చెప్పాడు. ఒక కన్నడ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రశాంత్ చెప్పిన ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఉపేంద్ర నూతన చిత్రం యుఐ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కూడా ఆయన చెప్పాడు. ఇక ఉపేంద్ర రెండు దశాబ్దాల పై నుంచే తెలుగు ప్రేక్షకులకి పరిచయం.
సలార్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన ప్రశాంత్ తన తదుపరి చిత్రంగా సలార్ పార్ట్ 2 ని తెరక్కెక్కించే పనిలో ఉన్నాడు.ప్రభాస్ హీరోగా చేస్తున్న ఆ మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే బయటకి వచ్చే అవకాశం ఉంది. ఆ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చెయ్యనున్నాడు.కేజిఎఫ్ పార్ట్ 3 కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
Also Read