చిరంజీవి కి 100 కోట్లు ఇవ్వడానికి వాళ్ళు ఫిక్స్ అయ్యారా!
on Feb 28, 2024
కొంతమంది తెలుగు హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో తమ సత్తా చాటుతు ముందుకు దూసుకుపోతున్నారు. అదే టైం లో వాళ్ళ రెమ్యునరేషన్స్ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటున్నాయి. ఒక్కో సినిమాకి వంద కోట్లు దాకా తీసుకుంటారనే టాక్ అయితే చాలా బలంగానే ఉంది.నిర్మాతలు కూడా అంత పెద్ద మొత్తంలో ఇవ్వడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. తాజాగా ఈ జాబితాలో మెగాస్టార్ కూడా చేరారనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వినపడుతుంది.
చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ చేస్తున్నాడనే విషయం అందరకి తెలిసిందే. అలాగే ఇంకొన్ని సినిమాలకి కూడా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాటిల్లో ఒక మూవీని ఒక బడా సంస్థ నిర్మిస్తుంది. ఇప్పుడు ఆ సంస్థ చిరు కి 100 కోట్లు పారోతోషకాన్ని ముట్టచెప్పనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ ఎంత వరకు నిజమో తెలియదు గాని సదరు సంస్థ చిరుకి 100 కోట్లు ఇవ్వడానికి వెనుకాడటం లేదని అంటున్నారు.చిరంజీవి డేట్స్ దొరికితే చాలని అనుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజులైతే గాని ఈ విషయంపై పూర్తి క్లారిటీ రాదు.
తన నటనతో, డాన్సులతో, ఫైట్స్ తో తెలుగు సినిమాకి సరికొత్త హుషారుని తీసుకొచ్చింది చిరంజీవే. ఈ విషయంలో ఎవరి కి ఎలాంటి అనుమానం లేదు. ఘరానా మొగుడు సినిమా టైంలో ఇండియాలోనే అత్యధిక పారితోషకం అందుకున్న నటుడుగా కూడా ఆయన నిలిచాడు. దీన్ని బట్టి బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన హవా ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.చిరు అయితే ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. సోషియో ఫాంటసీ గా తెరకెక్కుతున్న ఆ మూవీకి వశిష్ఠ దర్శకుడు
Also Read