హైదరాబాద్ అమ్మాయితో విశాల్ పెళ్ళి ఫిక్స్!!
on Jan 2, 2019
తెలుగు, తమిళ చిత్రాలలో నటించి యాక్షన్ హీరో పెరు తెచ్చుకున్న విశాల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలుస్తోంది. అయితే నటి వరలక్ష్మితో ఆయకు లవ్ ఎఫైర్ ఉన్నట్లు గతంలో సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై నటి వరలక్ష్మి `` తనకు విశాల్ మంచి మిత్రుడని, మా మధ్య కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉందనీ ఇటీవల పలు ఇంటర్య్వూస్ లో క్లారిటీ ఇస్తూ వచ్చింది. లేటెస్ట్ గా విశాల్ పెద్దలు నిశ్చయించిన వివాహం చేసుకోబోతున్నాడని, త్వరలోనే నిశ్చితార్థం కూడా జరగనుందని వార్తలు వస్తున్నాయి.
ఈ యాక్షన్ హీరో ఎవరిని వివాహమాడబోతున్నాడు అనే దానిపై ప్రస్తుతం చర్చలు ప్రారంభమయ్యాయి. దీనిపై విశాల్ తండ్రి కొంత క్లారిటీ ఇచ్చాడు. అనిషా అనే అమ్మాయితో విశాల్ పెళ్లి జరుగుతుందనీ, హైదరాబాద్ లోనే నిశ్చితార్థం నిర్వహిస్తామని తెలిపారు. విశాల్ నటుడిగానే కాదు, సామాజిక కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నారు. నిర్మాతల మండలికి, నడిగర్ సంఘానికి ప్రెసిడెంట్ గా కూడా వ్వవహరిస్తోన్న విషయం తెలిసిందే.