మహేష్ బాబు నా హీరో అన్న రాజమౌళి.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!
on Dec 21, 2021

పాన్ ఇండియా సినిమాలు 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్'లకు దారి ఇస్తూ సంక్రాంతి బరి నుంచి 'భీమ్లా నాయక్' తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దర్శకధీరుడు రాజమౌళి చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుని ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ మహేష్ ఫ్యాన్స్ కి ట్రీట్ లా ఉంది. #MyHero అంటూ ట్విట్టర్ లో ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
జనవరి 7 న 'ఆర్ఆర్ఆర్', జనవరి 12 న 'భీమ్లా నాయక్', జనవరి 13 న 'సర్కారు వారి పాట', జనవరి 14 న 'రాధేశ్యామ్'.. ఇలా నాలుగు పెద్ద సినిమాలో పొంగల్ రేసులో ఉన్నట్లు మొదట ప్రకటించారు. అయితే మహేష్ 'సర్కారు వారి పాట' పొంగల్ రేసు నుంచి తప్పుకొని ఏప్రిల్ 1 కి పోస్ట్ పోన్ అయింది. 'భీమ్లా నాయక్'ను ఎట్టిపరిస్థితుల్లోనూ పొంగల్ కే రిలీజ్ చేయాలని మేకర్స్ చూశారు. హిందీలో కూడా భారీగా విడుదల అవుతూ.. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్న పాన్ ఇండియా సినిమాలు 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' సినిమాల వాయిదా కుదరదని ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ చేయడంతో.. ఎట్టకేలకు 'భీమ్లా నాయక్' మేకర్స్ దిగొచ్చారు. సినిమాని ఫిబ్రవరి 25 కి వాయిదా వేశారు. ఈ సయోధ్యలో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజ్ ముఖ్య పాత్ర పోషించారు. అంతేకాదు ఫిబ్రవరి 25 న విడుదల కావాల్సిన తన F3 సినిమాని ఏప్రిల్ 29 కి వాయిదా వేసుకున్నారు.
తమ సినిమాకి దారి ఇస్తూ సినిమాలు వాయిదా వేసుకున్నందుకు రాజమౌళి ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు నిర్మాతలు చినబాబు, దిల్ రాజుకి థాంక్స్ చెప్పారు. అలాగే 'భీమ్లా నాయక్', F3 సినిమాలకు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పుకొచ్చారు. ఇక మహేష్ ని ఉద్దేశించి ఆయన ట్వీట్ వైరల్ గా మారింది. 'సర్కారు వారి పాట' పొంగల్ కి పర్ఫెక్ట్ ఫిల్మ్ అయినప్పటికీ ఇండస్ట్రీలో హెల్తీ అట్మాస్పియర్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో అందరికంటే ముందుగా మహేష్ తన సినిమాకి సమ్మర్ కి వాయిదా వేసుకున్నారని రాజమౌళి ప్రశంసించారు. అంతేకాదు 'Thanks to my Hero' అని ట్వీట్ లో రాసుకొచ్చారు.

రాజమౌళి ట్వీట్ కి మహేష్ రిప్లై ఇచ్చారు. మీ చేసే సినిమాలకు ప్రేమ, గౌరవం పొందే అర్హత ఉంది. మీ 'ఆర్ఆర్ఆర్' ఫిల్మ్ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నానని మహేష్ తెలిపారు.
'ఆర్ఆర్ఆర్' తరువాత మహేష్ తో రాజమౌళి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మై హీరో అని ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు దీన్ని మహేష్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో #MyHero #SSMB29 ట్రెండింగ్ లో ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



