'ఒక తీయని మాటతో' అర్జునుడు వచ్చేశాడు!
on Dec 21, 2021
.webp)
శ్రీవిష్ణు హీరోగా 'జోహార్' ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'అర్జున ఫల్గుణ'. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా మరో సాంగ్ ని విడుదల చేసింది మూవీ టీమ్.
'అర్జున ఫల్గుణ' నుంచి 'ఒక తీయని మాటతో కళ్ళు మెరిసే' అంటూ సాగే పాటని నేడు(మంగళవారం) విడుదల చేశారు. హీరో, హీరోయిన్ మధ్య సాగే ఈ మెలోడీ సాంగ్ ఆకట్టుకుంటోంది. ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం అందించిన సంగీతం ఆహ్లాదకరంగా ఉంది. చైతన్య ప్రసాద్ అందించిన లిరిక్స్ వినసొంపుగా ఉన్నాయి. శశ్వత్ సింగ్, శ్రేయ అయ్యర్ ఆలపించిన ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. లిరికల్ వీడియోలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో హీరోహీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
విభిన్న కథతో తెరకెక్కిన 'అర్జున ఫల్గుణ' సినిమాలో శ్రీవిష్ణు జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమా డిసెంబర్ 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



