బన్నీ-స్నేహ వివాహ బంధానికి తొమ్మిదేళ్లు!
on Mar 6, 2020
మార్చి 6 అల్లు అర్జున్, స్నేహారెడ్డి పెళ్లి రోజు. ఈ శుక్రవారం వాళ్లిద్దరూ తమ 9వ వివాహ వార్షికోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసుకున్నాడు బన్నీ. తన పెళ్లి ఆల్బమ్‌లోంచి ఒక ఫొటోను సెలక్ట్ చేసుకొని దాన్ని షేర్ చేసిన అతను, పెళ్లయి తొమ్మిదేళ్లు. కాలం వేగంగా పరుగెత్తుతోంది, కానీ ప్రేమ ప్రతిరోజూ పెరుగుతుంది అనే కాప్షన్‌ను జోడించాడు. దానితో పాటు పిల్లలు అయాన్, అర్హలతో కలిసి తమ పెళ్లిరోజును సెలబ్రేట్ చేసుకున్న ఫొటోను కూడా బన్నీ పోస్ట్ చేశాడు. నా జీవితంలో చాలా అందమైన కానుకలను (క్యూటెస్ట్ గిఫ్ట్స్) ఇచ్చినందుకు థాంక్స్ క్యూటీ అని స్నేహకు సందేశాన్ని ఇచ్చాడు. 2011 మార్చి 6న స్నేహ మెడలో బన్నీ మూడు ముళ్లు వేశాడు. ఆ ఇద్దరిదీ పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం.
ఒక్కసారి అల్లు అర్జున్, స్నేహ ఫొటో ఆల్బమ్‌లోకి తొంగిచూస్తే...
1. ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీ షేర్ చేసిన తమ పెళ్లినాటి ఫొటో
2. పెళ్లిలో స్నేహను మురిపెంగా చూస్తున్న బన్నీ
3. ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బన్నీ, స్నేహ
4. ఒక ఫ్యామిలీ వేడుకలో స్నేహ, బన్నీ
5. హోలీ రోజు అయాన్‌కు ముద్దులు
6. అయాన్‌తో ఒక సరదా సందర్భం
7. ఇద్దరు పిల్లలతో స్కూటర్‌పై బన్నీ ఫీట్
8. పిల్లలతో జోవియల్ మూడ్‌లో...
9. 'నా పేరు సూర్య' సినిమా టైమ్‌లో ఒక కార్యక్రమంలో...
10. పెళ్లి రోజును పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్న జంట