రావు గోపాలరావుతో రఘు కుంచేకి పోలిక...
on Mar 3, 2020
తెలుగుతెరపై తనదైన శైలిలో విలనిజాన్ని పండించాడు అక్షతలు నటుడు రావుగోపాలరావు. ఆయన తర్వాత, ఆయనకు ముందు ఎంతో మంది నటులు ప్రతినాయకులుగా నటించారు. అయితే... ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతి కొద్దిమంది నటుల్లో ఒకరిగా రావు గోపాలరావు నిలిచారు. ఆయన తర్వాత... ఆ స్థాయిలో పల్లెటూరి పాత్రల్లో విలనిజం చూపించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు రావు గోపాలరావు గారి ప్రస్తావన ఎందుకంటే... ఈ శుక్రవారం 'పలాస 1978' అని ఒక సినిమా వస్తోంది. అందులో సంగీత దర్శకుడు రఘు కుంచే ప్రతినాయకుడిగా నటించారు. ఇంతకు ముందు కొన్ని చిత్రాలలో అడపాదడపా కాసేపు కనిపించే పాత్రలు చేసిన ఆయన ఈ సినిమాతో పూర్తిస్థాయి నటుడిగా తెరంగ్రేటం చేస్తున్నారు. పలాసలో రఘు కుంచే నటన ముత్యాల ముగ్గు రావుగోపాలరావు గారిని గుర్తు చేసింది అని మరో సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన పలువురు టాలీవుడ్ ప్రముఖులు అద్భుతం ఆహా ఓహౌ అంటూ పొగుడుతున్నారు. చిత్రబృందం అందరితోపాటు రఘు కొంచెం కూడా ప్రశంసలు వస్తున్నాయి. అయితే... రావుగోపాలరావు గారితో పోలిక మాత్రం పెద్దది.
Also Read